మరో ‘నిర్భయ’ ఘోరం | narsingh student raped in minibus in bangalore | Sakshi
Sakshi News home page

మరో ‘నిర్భయ’ ఘోరం

Nov 7 2015 1:59 AM | Updated on Nov 9 2018 4:36 PM

మరో ‘నిర్భయ’ ఘోరం - Sakshi

మరో ‘నిర్భయ’ ఘోరం

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో ‘నిర్భయ’ ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్

బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం
 
 సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో ‘నిర్భయ’ ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటే శివారులోని హసిగళలో ఉంటూ ఓ ప్రైవేటు క్లినిక్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతోంది. రోజు లాగానే గురువారం ఉదయం 7:30కు ఆమె ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లడానికి హసిగళ గ్రామంవద్ద మినీ బస్సు ఎక్కింది. ఆ సమయంలో మరో ఇద్దరు ప్రయాణికులు అందులో ఉన్నారు.

కొద్దిదూరం వెళ్లాక ఆమె  తప్ప మిగిలిన వారు దిగిపోయారు.  ఆమెపై కన్నువేసిన డ్రైవర్ రవి.. క్లీనర్ మంజునాథ్‌కు డ్రైవింగ్ అప్పజెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాలని చెప్పాడు. అనంతరం కిటికీలను మూసేసి కదులుతున్న వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. గాయపడిన బాధితురాలిని లక్కొండహళ్లి బస్టాప్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఆమె స్థానికుల సాయంతో తాను పనిచేస్తున్న నర్సింగ్‌హోంకు చేరుకుని సహచరులకు విషయం తెలిపింది.  వారి ఫిర్యాదుపై.. పోలీసులు రవి, మంజునాథ్‌లను అరెస్టు చేశారు. ఐపీసీ-376(డీ) ప్రకారం నిర్భయ కేసు పెట్టారు. ప్రధాన నిందితుడైన రవి బెంగళూరులోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇటీవల మినీ బస్సును అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. బస్సు ఏపీలోని అనంతపురానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement