నిజంగా వీరికి భూమ్మీద నూకలున్నాయి

జలంధర్: వాడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. ఇది సాధరణంగా పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో భయటపడిన వారిని ఉద్దేశించి చెప్పే మాట. ఈ సంఘటనకు ఈ మాట సరిగ్గా అతుక్కుపోతుందేమో.. అవును పంజాబ్‌లో ఓ ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చిన ప్రమాదం నుంచి రెప్పపాటుకాలంలో బయటపడ్డారు. ప్లై ఓవర్‌పై నుంచి పడుతున్న ఓ ట్రక్కు ప్రమాదం నుంచి మరో ట్రక్కు వారిని కాపాడింది. లేదంటే ఆ ఇద్దరు ట్రక్కు కిందపడి నుజ్జునుజ్జయ్యేవారేమో. పంజాబ్‌లోని జలందర్‌లో ప్లై ఓవర్‌పై ఓ హవానం వెళుతోంది. దానికింద పక్కనే మరో ట్రక్కు వస్తుంది.
అదే సమయంలో రోడ్డు పక్కనే మరో ట్రక్కు ఆపి ఉండగా దానికి ఎదురుగా ఓ వ్యక్తి సైకిల్‌పై వస్తుండగా మరో వ్యక్తి అక్కడే ఉన్నాడు. అంతలోగా కింద నుంచి వస్తున్న ట్రక్కు అతడికి ఎదురుగా దూసుకురావడంతో అతడు ఒక్కసారిగా పక్కకు తప్పుకునే ప్రయత్నంలోకి జారుకున్నాడు. అంతలోగే పెద్ద ట్రక్కు ప్లై ఓవర్ మీద నుంచి పెద్ద శబ్దంతో పడిపోయింది. అది చూసి వారి గుండెలు అదిరిపడ్డాయి. ఎదురుగా వచ్చిన ట్రక్కు వారి ప్రాణాలు కాపాడి వెళ్లిపోయింది. ప్లైఓవర్‌పై నుంచి కిందపడిన ట్రక్కులో ఒక డ్రైవర్, మరో రిక్షా కార్మికుడు గాయపడ్డారు. జలందర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.