‘శివభక్తా.. నువ్వు పూజలు చేయాలన్నా వీసా ఉండాల్సిందే’

Narendra Modi Said Shiv Bhakt Would Need Visa For Somnath Temple - Sakshi

అహ్మదాబాద్‌ : ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం – స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఒకవేళ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ లేకపోతే ఈ శివభక్తులు గుజరాత్‌ సోమ్‌నాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించాలన్నా.. హైదరాబాద్‌ చార్మినార్‌ను సందర్శించాలన్న వీసా తీసుకోవాల్సివచ్చేదంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి చురకలంటించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి పాటుపడిన నేతకు నివాళి అర్పించడం వారి దృష్టిలో పెద్ద నేరం అయ్యింది. దేశ సమగ్రతకు పాటుపడిన మహా నాయకుని గురించి కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ఒక వేళ సర్దార్‌ పటేల్‌ గనక దేశ ఐక్యత కోసం పాటు పడకపోతే నేడు గిర్‌ అభయారణ్యంలోని పులులను, సింహాలను చూడాలన్న.. ఈ సోకాల్డ్‌ శివభక్తులు సోమ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాలన్నా.. హైదరాబాద్‌ చార్మినార్‌ను సందర్శించాలన్న వీసాలు తీసుకోవాల్సి వచ్చేద’ని గుర్తు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top