‘నోట్ల రద్దు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు’ | Narendra Modi Said Notes Ban Was Not A Jhatka | Sakshi
Sakshi News home page

‘దీని గురించి ఏడాది ముందుగానే చెప్పాం’

Jan 1 2019 6:29 PM | Updated on Apr 3 2019 5:16 PM

Narendra Modi Said Notes Ban Was Not A Jhatka - Sakshi

మోదీ కూడా ఇతర ప్రధానుల్లానే. కేవలం మాటలు చెప్తారు అని భావించారు

న్యూఢిల్లీ : నోట్ల రద్దు విషయం అప్పటికప్పుడు ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అనూహ్యమైన షాక్‌ ఏం కాదు. ఈ విషయం గురించి ఓ ఏడాది ముందు నుంచే చెబుతున్నాం. నల్ల ధనం ఉన్న వారందరిని ఏడాది ముందే నుంచే హెచ్చరిస్తున్నాం. మీ దగ్గర ఉన్న నల్లధనాన్ని డిపాజిట్‌ చేయండి.. జరిమానా చెల్లించి ఇబ్బందుల నుంచి బయటపడండి అని చెప్పాను’ అన్నారు.

కానీ చాలా మంది ‘మోదీ కూడా ఇతర ప్రధానుల్లానే. కేవలం మాటలు చెప్తారు అని భావించారు. ఫలితం అనుభవించారు. చాలా కొద్ది మంది మాత్రమే నేను చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆచరించార’ని పేర్కొన్నారు. ​

Advertisement
 
Advertisement
Advertisement