మైసూరు అమ్మాయి, నెదర్లాండ్స్‌ అబ్బాయి | Mysore Woman Love Marriage With Netherlands Man | Sakshi
Sakshi News home page

మైసూరు అమ్మాయి, నెదర్లాండ్స్‌ అబ్బాయి

Nov 5 2019 8:44 AM | Updated on Nov 6 2019 9:43 AM

Mysore Woman Love Marriage With Netherlands Man - Sakshi

వివాహ వేడుకలో అను, రెనె

కర్ణాటక, మైసూరు: ప్రేమకు భాషలు,ప్రాంతాలు అడ్డుకాదని మైసూరు చెందిన యువతి, నెదర్లాండ్స్‌కు చెందిన ఓ యువకుడు ఏడడుగులతో ఒక్కటై నిరూపించారు. మైసూరుకు చెందిన అను అనే యువతి కొంతకాలం క్రితం ఎల్‌ఎల్‌ఎం చదవడానికి నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అక్కడ పరిచయమైన నెదర్లాండ్స్‌ యువకుడు రెనె వ్యాన్‌ బోర్గెట్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ తల్లితండ్రులకు తెలియజేయగా, ఇరువైపుల పెద్ద మనసుతో అంగీకరించారు. కుటుంబంతో కలిసి మైసూరుకు చేరుకున్న వరుడు రెనె సోమవారం తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం అనుకు మూడుముళ్లు వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement