ఆ జాబితాలో ముంబైకు చోటు

Mumbai Featured Among Most Innovative Cities Of The World - Sakshi

సాక్షి, ముంబై : ప్రపంచంలోని 100 అత్యంత వినూత్న నగరాల జాబితాలో భారత ఆర్థిక, వినోద రాజధాని ముంబైకి చోటుదక్కింది. టుథింక్‌నో అనే కమర్షియల్‌ డేటా ప్రొవైడర్‌ ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో జపాన్‌ రాజధాని టోక్యో అగ్రస్ధానంలో నిలిచింది. 2017లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో 90వ స్ధానంలో చోటు దక్కించుకున్న ముంబై ఈసారి 92వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.

ఈ జాబితాలో మరో భారతీయ నగరం బెంగళూర్‌ 139వ స్ధానంలో నిలిచింది. ఇక హైదరాబాద్‌ 316వ ర్యాంక్‌, ఢిల్లీ (199), చెన్నై (252), కోల్‌కతా (283), అహ్మదాబాద్‌ (345), పూణే (346), జైపూర్‌ (393), సూరత్‌ (424), లక్నో (442), కాన్పూర్‌ 9448), మధురై 452వ ర్యాంక్‌ను సాధించాయి. 2017లో టాప్‌ ఇన్నోవేటివ్‌ సిటీగా నిలిచిన లండన్‌ తాజా జాబితాలో రెండవ ర్యాంక్‌ను దక్కించుకుంది.

టాప్‌ 10 నగరాల్లో శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌, లాస్‌ఏంజెల్స్‌, సింగపూర్‌, బోస్టన్‌, టొరంటో, పారిస్‌, సిడ్నీలున్నాయి. రోబోటిక్స్‌, త్రీడీ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో దూసుకుపోతున్న కారణంగానే లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలను అధిగమించి టోక్యో నెంబర్‌వన్‌గా నిలిచింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top