రుద్రుడి మాయేమో..! | Mumbai building collapse: 6 dead, several feared trapped under debris | Sakshi
Sakshi News home page

రుద్రుడి మాయేమో..!

Jul 31 2014 11:32 PM | Updated on Sep 2 2017 11:10 AM

రుద్రుడి మాయేమో..!

రుద్రుడి మాయేమో..!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకరుడి పేరు పెట్టుకున్నందుకేనేమో..

ప్రాణాలతో బయటపడ్డ తల్లీబిడ్డలు
ముంబై, న్యూస్‌లైన్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకరుడి పేరు పెట్టుకున్నందుకేనేమో.. ఊరు సమాధి అయినా ఆ శిథిలాల నుంచి మూడునెలల రుద్రుడనే చిన్నారి బాలుడు తల్లి ప్రమీలతోసహా ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కిందే 30 గంటలు గడిపిన తల్లీబిడ్డలను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గురువారం బయటకు తీసింది. దీంతో ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడినవారి సంఖ్య 8కి చేరింది.  

అప్పటిదాకా బయటే ఉన్న తల్లి.. బిడ్డ ఏడ్వడంతో పాలిద్దామని ఇంట్లోకి వెళ్లిందని, అంతలోనే కొండచరియలు విరిగిపడి ఆ ఇంటిని కప్పేశాయని, అయితే ఇంట్లోని ఓ గదిలో ఉన్న తల్లీబిడ్డకు మాత్రం ఎటువంటి హాని కలగలేదని, దాదాపు 30 గంటలు శిథిలాల కింద ఉన్న కారణంగా నీరసించిపోయిందని అక్కడివారు తెలిపారు. తల్లీబిడ్డలిద్దరిని వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి పంపించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement