అమ్మ ప్రేమ : ఎలా మిస్‌ అవుతుంది?

Mother Langur Saving Her Child From Falling Video Viral - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్ప పేమ్ర ఏదీ లేదు. అమ్మచూపించే భద్రత, అమ్మ మన పట్ల తీసుకునే బాధ్యతని ఈ ప్రపంచంలో ఎవరు తీసుకోలేరు. అందుకే తల్లిని ప్రేమను మించిన దైవం ఉండదు అని అంటారు. కొన్ని సార్లు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకోసం కష్టపడుతుంది తల్లి. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. విద్యుత్‌ తీగలపై చిక్కుకున్న బిడ్డను ప్రాణాలకు తెగించి కాపాడింది ఓ తల్లి కోతి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘తల్లి చేసిన రెస్క్యూ ఆపరేషన్. ఎలా విఫలమవుతుంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

వీడియో ప్రకారం.. ఓ  పిల్ల కోతి విద్యుత్‌ తీగలపై ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా.. తల్లి కోతి ఉన్న బిల్డింగ్‌పై చేరుకోలేకపోతుంది.  విద్యుత్‌ తీగలపై ఇరుక్కొని బయటకు రాలేక అవస్థలు పడుతున్న బిడ్డని చూసి తల్లి కోతి తల్లడిల్లిపోయింది. వెంటనే తీగలపై దూకి బిడ్డను కాపాడే ప్రయత్నం చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. దీంతో తిరిగి బిల్డింగ్‌పైకి జంప్‌ చేసిన తల్లి కోతి మరో మారు ప్రయత్నించింది. ఈ సారి గట్టిగా జంప్‌ చేసి క్షణాల్లో పిల్ల కోతిని తీసుకొని బిల్డింగ్‌పై దూకింది. ప్రసుత్తం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.‘తల్లి ప్రేమ  మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా ఒకేలా ఉంటుంది’,, ‘ బిడ్డ రక్షణ కోసం తల్లి ఏ పనైనా చేస్తోంది’,, ‘వావ్‌, తల్లి ప్రేమ అంటే ఇదే’,, ‘గొప్ప వీడియో.. తల్లి ప్రేమ వెలకట్టలేనిది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top