మరో రెండు చానళ్లపై వేటు | More two Channels on Suspended | Sakshi
Sakshi News home page

మరో రెండు చానళ్లపై వేటు

Nov 6 2016 9:40 AM | Updated on Oct 17 2018 4:54 PM

మరో రెండు చానళ్లపై వేటు - Sakshi

మరో రెండు చానళ్లపై వేటు

‘ఎన్డీటీవీ ఇండియా’ చానల్‌పై నిషేధం విధించడాన్ని విపక్షాలు తప్పుబడుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో రెండు చానళ్లపై వేటు వేసింది.

న్యూఢిల్లీ: ‘ఎన్డీటీవీ ఇండియా’ చానల్‌పై నిషేధం విధించడాన్ని విపక్షాలు తప్పుబడుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో రెండు చానళ్లపై వేటు వేసింది. ‘న్యూస్ టైం అస్సాం’ చానల్ పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదు. దీంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2013లోనే చానెల్‌పై నిషేధం విధించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినా అప్పట్లో అమలు కాలేదు. మరో ఉత్తర్వులో ‘కేర్ వరల్డ్ టీవీ’ అనే చానల్‌ను కూడా ప్రభుత్వం నిషేధించింది. అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను వారం రోజులపాటు నిషేధించింది.

Advertisement
 
Advertisement
Advertisement