అంతర్జాతీయ వేదికపై భారత్ వెలుగులు

Modi Attends Gandhi Birth Anniversery Event In Gujarath - Sakshi

అహ్మదాబాద్‌ : మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలను ఐక్యరాజ్యసమితి ఘనంగా నిర్వహిస్తోందని, బాపూ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచంలో ప్రతి సవాల్‌కూ మహాత్మ గాంధీ పరిష్కారాలు సూచించారని చెప్పారు. అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట ఇనుమడిస్తోందని చెప్పుకొచ్చారు. అమెరికాలో తాను యోగ ప్రాధాన్యత వివరించిన తర్వాత అమెరికా ప్రపంచ యోగా డేను గుర్తించిందని అన్నారు. బాపూ మార్గం నిత్యం అనుసరణీయమని స్పష్టం చేశారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆశ్రమంలో పిల్లలు, వలంటీర్లతో ముచ్చటించిన మోదీ, కొద్దిసేపు సబర్మతీ నదీ తీరంలో గడిపారు. గాంధీజీ సైకత శిల్పాలను వీక్షించారు. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఆయా కార్యక్రమాల్లో ప్రధాని వెంట ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top