వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్ | Model Held For Allegedly Running Prostitution Racket In Mumbai | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్

Jun 27 2016 11:53 AM | Updated on Sep 4 2017 3:33 AM

వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్

వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్

కొందరు యువతుల కష్టాలను అవకాశంగా తీసుకొని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మోడల్ను పోలీసులు అరెస్టు చేశారు.

ముంబయి: కొందరు యువతుల కష్టాలను అవకాశంగా తీసుకొని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మోడల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బారిన పడిన పలువురు మోడల్స్కు విముక్తి కలిగించారు. పశ్చిమ ముంబయిలోని వర్సోవా అనే ప్రాంతంలో ప్రొడక్షన్ హౌజ్ పేరిట ఓ నివాసం ఉంది. అందులో ఓ 24 ఏళ్ల మోడల్ ఉంటోంది.

ఆమె సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను లక్ష్యంగా చేసుకొని వారికి లేనిపోని ఆశలు కలిగించి వ్యభిచార రొంపిలోకి దింపింది. దాంతోపాటు పలువురు మైనర్స్ను కూడా కొనుగోలు చేస్తూ వారితో ఇలాంటి పాడుపని చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నివాసంపై రైడింగ్ చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకొన్నారు. అందులో ఎంతోమంది మోడల్స్ ఫొటోలతోపాటు ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement