జార్ఖండ్, బిహార్లో భూప్రకంపనలు | Mild tremors felt in parts of Bihar and Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్, బిహార్లో భూప్రకంపనలు

Dec 15 2015 9:46 AM | Updated on Sep 3 2017 2:03 PM

జార్ఖండ్, బిహార్లో భూప్రకంపనలు

జార్ఖండ్, బిహార్లో భూప్రకంపనలు

జార్ఖండ్లో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది.

రాంచీ: జార్ఖండ్లో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. దీని ప్రభావంతో జార్ఖండ్తో పాటు బిహార్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.

జార్ఖండ్లోని దేవ్గఢ్, ధన్బాద్, బిహార్లోని గయ, జముయ్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దేవ్గఢ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement