రూ 12 లక్షలు తినేసిన ఎలుక.. | Mice Chew Up Cash In Assam ATM | Sakshi
Sakshi News home page

రూ 12 లక్షలు తినేసిన ఎలుక..

Jun 19 2018 8:54 AM | Updated on Jun 19 2018 2:12 PM

Mice Chew Up Cash In Assam ATM - Sakshi

ఏటీఎంలో ఎలుక పాలైన రూ 12 లక్షలు

సాక్షి, గువహటి : ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులతో ప్రజలు అల్లాడుతుంటే అసోంలోని ఓ ఏటీఎంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టిన్సుకియా లైపులి ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఉంచిన రూ 12.38 లక్షలను ఎలుక  కొరికేసింది. మే 19న ప్రైవేట్‌ సెక్యూరిటీ కంపెనీ ఈ ఏటీఎంలో రూ 29.48 లక్షల విలువైన రూ 2000, రూ 500 నోట్లను నింపింది. ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక పేర్కొంది.

జూన్‌ 11న సెక్యూరిటీ కంపెనీ ప్రతినిధులు ఏటీఎంను తిరిగి ఓపెన్‌ చేయగా రూ 12.38 లక్షలను ఎలుకలు కొరికేసి చిందరవందరగా పడిఉండటాన్ని గుర్తించారు. మెషీన్‌లో దూరిన ఎలుకే ఈ పనిచేసిందని భావిస్తున్నారు. దీనిపై టిన్సుకియా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోషల్‌ మీడియాలో ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement