ఉత్తర ప్రదేశ్ మథుర హత్యాకాండ జరిగిన ఘటనా స్థలం వద్ద అమెరికాకు చెందిన అధునాతన రాకెట్ లాంచర్ ను పోలీసులు గుర్తించారు.
మథుర: ఉత్తర ప్రదేశ్ మథుర హత్యాకాండ జరిగిన ఘటనా స్థలం వద్ద అమెరికాకు చెందిన అధునాతన రాకెట్ లాంచర్ ను పోలీసులు గుర్తించారు. వీటిని పరిశీలించేందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికార్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రాకెట్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నాక నిపుణులను పిలిచి వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని మథుర జిల్లా ఎస్పీ బబ్లు కుమార్ యాదవ్ చెప్పారు. ఇవి ఎవరివి, ఎక్కడి నుండి వచ్చాయో చేధించాల్సి వుందని ఆయన చెప్పారు.
ఆజాద్ భారత్ విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి ఆక్రమించుకున్న 280 ఎకరాల స్థలంలో సోదాలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఈ ఆయుధాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఆందోళనకారులు ఆక్రమించుకున్న స్థలాన్ని కోర్టు ఆదేశాల మేరకు ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై దాడికి దిగడంతో ఎస్పీ, ఓ పోలీసుతో సహా మొత్తం29 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.