ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి | maoist killed in encounter in bijapur | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

May 21 2016 8:56 AM | Updated on Oct 9 2018 2:47 PM

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి - Sakshi

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్లో శనివారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్గఢ్: తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొట్టేరుకర్నేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న కోబ్రా, 85వ బెటాలియన్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా నక్సల్ సహా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సంఘటన స్థలంలో రెండు నాటు తుపాకులు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement