
మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2018–19 వార్షిక బడ్జెట్‌లో పలు రైతు అనుకూల చర్యలను ప్రకటించింది. రైతులకు పింఛన్లు, రుణ ఊబిలో చిక్కుకున్న వారికి సాయపడేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటును ప్రకటించింది. రైతుల భూములపై మ్యుటేషన్ ఫీజు, గ్రీన్‌టీ ఆకులపై సెస్సు, వ్యవసాయ పన్నును మినహాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్టాంప్‌డ్యూటీని గణనీయంగా తగ్గించింది. దివ్యాంగుల పింఛను నెలకు రూ.750 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళల కోసం రూ.1,500 కోట్లతో కన్యశ్రీ, రూపశ్రీ పథకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రఆర్థికమంత్రి అమిత్ మిత్రా బుధవారం అసెంబ్లీలో రూ.2,14,958 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.