శ్రీనగర్‌లో భారీ అగ‍్ని ప్రమాదం | Major fire breaks near Lal Chowk in Srinagar, Jammu and Kashmir; several shops destroyed | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో భారీ అగ‍్ని ప్రమాదం

Jan 13 2017 9:56 AM | Updated on Oct 2 2018 4:26 PM

శ్రీనగర్‌లో భారీ అగ‍్ని ప్రమాదం - Sakshi

శ్రీనగర్‌లో భారీ అగ‍్ని ప్రమాదం

శ్రీనగర్‌ కోర్టు రోడ్డులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

జమ్మూకశ్మీర్‌ : శ్రీనగర్‌ లాల్‌చౌక్‌ సమీపంలోని కోర్టు రోడ్డులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధం కాగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, విజయ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీస్‌కు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

మరోవైపు ముంబయిలోనూ అగ్నిప్రమాదం జరిగింది. మన్‌ఖర్ద్‌ ప్రాంతంలోని ఓ స్క్రాప్‌ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement