కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌.. ఇద్దరు మృతి!

Lockdown Two Drunk Addict Eliminated After Swallow Shaving Lotion - Sakshi

చెన్నై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యానికి బానిసైనవారు మతి చెడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మత్తు కోసం ఏవేవో పుకార్లు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో నాలుగు రోజుల క్రితం కేరళలో ఓ వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే.. తమిళనాడులోనూ అలాంటి విషాదమే వెలుగు చూసింది. పుదుకొట్టై జిల్లాలోని ఇద్దరు మత్స్యకార యువకులు కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రిలో విషమ స్థితిలో ఉన్నారు.
(చదవండి: దారుణం: రసాయనం మందు వాసన వస్తుండటంతో..)

కొట్టైపట్టినమ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకార యువకులు ఎం.హసన్‌ మైదీన్‌ (35), పి.అన్వర్‌ రాజా (33), ఎం.అరుణ్‌ కంతియాన్‌ (29) నిత్యం మద్యం సేవించేవారు. అయితే, లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు బంద్‌ కావడంతో.. ఎవరో చెప్పిన మాటలు విని.. శుక్రవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని సేవించారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే, మైదీన్‌, అరుణ్‌ వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొంతుతూ వారు ప్రాణాలు విడిచారు. అస్వస్థతకు గురైన అన్వర్‌ను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ‘ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌’ ద్రావణం తాగి పశ్చిమ గోదావరిలో కూడా ఒక యువకుడు మరణించిన సంగతి తెలిసిందే.
(చదవండి: మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top