దారుణం: రసాయనం మందు వాసన వస్తుండటంతో..

Youngman Died Drunked Sanitizer in West Godavari - Sakshi

‘ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌’ తాగిన ఆరుగురు మిత్రులు 

ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

జిల్లాలో కలకలం

పశ్చిమ గోదావరి, తణుకు: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైన్‌ షాపులు బంద్‌ కావడంతో మద్యానికి బానిసలైన కొందరు యువకులు శానిటైజర్‌లో వినియోగించే ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగిందంటే.. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ధర్నాల నవీన్‌ మూర్తిరాజు (22), అదే గ్రామానికి చెందిన అల్లాడి వెంకటేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన పండూరి వీరేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్‌ మిత్రులు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులు మూతపడడంతో వీరు ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. పండూరి వీరేష్‌ తణుకు మండలం పైడిపర్రులో అంబికా కెమికల్స్‌లో పని చేస్తున్నాడు. ఈనెల 29వ తేదీ ఆదివారం ఏలూరు నుంచి సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం లోడ్‌ వచ్చింది. టిన్నులు దించడానికి వీరేష్‌ను యజమాని తమ్మయ్యనాయుడు పిలిపించారు. ఆదివారం ఉదయం లోడ్‌ దించిన తర్వాత అక్కడే శానిటైజర్‌లో ముడిపదార్థంగా ఉపయోగించే ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌ను 400 మిల్లీలీటర్లు బాటిల్‌లో వీరేష్‌ పట్టుకెళ్లాడు.

అదే రోజు మధ్యాహ్నం తన మిత్రులకు ఫోన్‌ చేసి శానిటైజర్‌ తయారు చేసుకుందాం... ఇందుకు సంబంధించి ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌ను తీసుకువచ్చానని చెప్పాడు. దీంతో ధర్నాల నవీన్‌ మూర్తిరాజు, అల్లాడి వెంకటేష్, తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్‌ వీరేష్‌ను కలిశారు. వీరంతా కావలిపురం చెరువు దగ్గర కలుసుకుని మాట్లాడుకున్నారు. మద్యం దొరక్కపోవడంతోపాటు తీసుకువచ్చిన రసాయనం మందు వాసన వస్తుండటంతో వీరంతా కలిసి స్ప్రైట్‌లో కలుపుకుని తాగారు. వీరిలో ధర్నాల నవీన్‌బాబు, వెంకటేష్, వీరేష్‌ ఎక్కువ మోతాదులో తాగారు. దుర్గారావు, దుర్గాప్రసాద్, శ్యాంసుందర్‌ భయంతో తక్కువ మోతాదులో తీసుకున్నారు.

వీరంతా ఇంటికి వెళ్లిపోయాక మరుసటి రోజు నవీన్‌మూర్తిరాజు పరిస్థితి విషమిచండంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. వెంకటేష్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం చేరడంతో విషయం ఆలస్యంగా బయట పడింది. వీరేష్‌ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో తణుకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దర్యాపు చేపట్టారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.అనసూయదేవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

11-07-2020
Jul 11, 2020, 05:33 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24...
11-07-2020
Jul 11, 2020, 04:40 IST
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్‌ పాలసీలను ‘కరోనా కవచ్‌’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా...
11-07-2020
Jul 11, 2020, 03:53 IST
నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి నలుగురు రోగులు మృతి చెందడం కలకలం రేగింది. వీరిలో కరోనా కాటుకు...
11-07-2020
Jul 11, 2020, 03:22 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కరాళనృత్యంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం కదిలింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ టంతో వేగంగా కరోనా...
10-07-2020
Jul 10, 2020, 20:44 IST
బీజింగ్‌ : కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలమైన చైనా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీజ్‌ చేసిన రొయ్యల ప్యాకేజీలో కరోనా వైరస్‌ను...
10-07-2020
Jul 10, 2020, 19:49 IST
సీఎం కేసీఆర్‌కు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ,
10-07-2020
Jul 10, 2020, 19:22 IST
సాక్షి, న్యూఢిల్లీ:అమెరికాకు చెందిన ప్రసిద‍్ధ బైక్స్‌ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్  కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు...
10-07-2020
Jul 10, 2020, 16:04 IST
కరోనా రోగులు, బ్లడ్‌ క్లాట్స్‌కు సంబంధించి పాథాలజిస్టులు లేబొరేటరీల్లో నిర్వహించిన పరిశోధనలో కీలక  విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో బాధపడిన రోగుల్లో ఏర్పడిన...
10-07-2020
Jul 10, 2020, 15:44 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. అదే సమయంలో మరణాల...
10-07-2020
Jul 10, 2020, 15:40 IST
సాక్షి, వెబ్ ప్ర‌త్యేకం: నిజం గ‌డ‌ప దాటేలోపు అబ‌ద్ధం ఊరు చుట్టొస్తుంది అంటారు. ఊరేంటి.. ఈ భూగోళాన్నే చుట్టొస్తుంది. పైగా నిజాన్ని...
10-07-2020
Jul 10, 2020, 14:48 IST
సాక్షి, అమరావతి: ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే...
10-07-2020
Jul 10, 2020, 14:27 IST
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి మరోసారి కరోనా సెగ  తాకింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. ...
10-07-2020
Jul 10, 2020, 14:00 IST
సాక్షి, అమరావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్ర‌వారం కొత్త‌గా 1608 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 సాంపిల్స్‌ను...
10-07-2020
Jul 10, 2020, 11:24 IST
కొత్తగూడెం, అశ్వాపురం: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ...
10-07-2020
Jul 10, 2020, 11:17 IST
కర్నూలు(హాస్పిటల్‌): అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు కోవిడ్‌–19 టెస్ట్‌ ఫలితం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు....
10-07-2020
Jul 10, 2020, 11:16 IST
నూర్‌ సుల్తాన్‌/బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. సరిహద్దు దేశం...
10-07-2020
Jul 10, 2020, 10:51 IST
ల‌క్నో :  క‌రోనా కేసులు తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది....
10-07-2020
Jul 10, 2020, 10:21 IST
సాక్షి, నిజామాబాద్ : క‌రోనాతో ఒకేసారి న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందిన ఘ‌ట‌న నిజామాబాద్‌ జిల్లా ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రిలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది....
10-07-2020
Jul 10, 2020, 08:16 IST
లాపాజ్‌: బొలీవియా తాత్కాలిక అధ్య‌క్షురాలు జీనిన్ అనెజ్‌ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆమె త‌నకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని గురువారం...
10-07-2020
Jul 10, 2020, 07:24 IST
ప్రతి సంవత్సరం జూన్, జూలైలో చెప్పులకు గిరాకీ ఎక్కువగా ఉండేది.. స్కూలు పిల్లలు షూస్‌ కోసం.. వర్షాకాలం కావడంతో వాటర్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top