మావోల లేఖల్లో దిగ్విజయ్‌ నంబర్‌

Letter With Digvijaya Singh's Number Found In Elgar Parishad Probe - Sakshi

పుణె పోలీసుల వెల్లడి

ధైర్యముంటే చర్యలు తీసుకోండని డిగ్గీ సవాలు

పుణె: ఎల్గార్‌ పరిషత్‌ కేసు విచారణలో భాగంగా తమకు లభించిన లేఖల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్‌ నంబర్‌ ఉందని పుణె పోలీసులు వెల్లడించారు. దాంతో చార్జిషీట్లో దానిని చేర్చామన్నారు. సెప్టెంబర్‌ 25, 2017న సురేంద్ర గాడ్లింగ్‌ అనే మానవహక్కుల కార్యకర్తకు మావోయిస్టు నేత నుంచి వచ్చిన ఒక లేఖలో దిగ్విజయ్‌ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్‌ నెంబర్‌ ఉందని తెలిపారు. ‘విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్త నిరసనలను మనం మరింత తీవ్రతరం చేయాలి. సాధారణంగా పోలీసులు విద్యార్థులతో కఠినంగా వ్యవహరించలేరు. అది మనకు అనుకూలత. మన ఉద్యమాలకు సహకరించేందుకు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెంబర్‌లో మన మిత్రుడిని సంప్రదించగలరు’ అని ఆ లేఖలో ఉందన్నారు. ఆ నెంబర్‌ దిగ్విజయ్‌ సింగ్‌దేనని పోలీసులు భావిస్తున్నారన్నారు. ఆ నంబర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌లోనూ ఉందని ఒక పోలీసు అధికారి చెప్పారు. దిగ్విజయ్‌ స్పందిస్తూ.. ధైర్యముంటే తనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌లకు సవాల్‌ విసిరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top