‘మోదీతోపాటు పాసైన వారి వివరాలు చూసుకోనివ్వండి’ | Let them also see the detailf of degress passed persons with Modi | Sakshi
Sakshi News home page

‘మోదీతోపాటు పాసైన వారి వివరాలు చూసుకోనివ్వండి’

Jan 9 2017 2:58 AM | Updated on Aug 15 2018 6:32 PM

1978లో బీఏ డిగ్రీ పాసైన విద్యార్థులందరి వివరాలను చూసుకోడానికి సమాచార హక్కు దరఖాస్తుదారుడిని అనుమతించాలని

న్యూఢిల్లీ: 1978లో బీఏ డిగ్రీ పాసైన విద్యార్థులందరి వివరాలను చూసుకోడానికి సమాచార హక్కు దరఖాస్తుదారుడిని అనుమతించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది. ప్రధాని మోదీ 1978లో డిగ్రీ పాసయ్యారని డీయూ గతంలో పేర్కొనడం తెలిసిందే. 1978లో డీయూలో బీఏ పరీక్షలు ఎంతమంది రాశారు, ఎంత మంది పాసయ్యారు తెలపాల్సిందిగా నీరజ్‌ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు.

ఆ వివరాలన్నీ వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయంటూ విశ్వవిద్యాలయ కేంద్ర ప్రజా సమాచార అధికారి మీనాక్షి సహాయ్‌ వాటిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ వివరాలను తనిఖీ చేసుకోడానికి అనుమతించడంతోపాటు ఒక కాపీని ఉచితంగా దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సిందేనని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు తాజాగా మీనాక్షి సహాయ్‌ని ఆదేశించారు. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన న్యాయవాది మహమ్మద్‌ ఇర్సద్‌ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ మీనాక్షికి రూ.25,000 జరిమానాను కూడా మాడభూషి విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement