వైరల్‌ : నిజంగా ఇదో అద్భుతమైన థ్రిల్లర్! | Leopard Trying To Eat Monkey On Tree BranchesLeopard Trying To Eat Monkey On Tree Branches | Sakshi
Sakshi News home page

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం..

Jun 5 2020 2:24 PM | Updated on Jun 5 2020 2:38 PM

Leopard Trying To Eat Monkey On Tree BranchesLeopard Trying To Eat Monkey On Tree Branches - Sakshi

వీడియో దృశ్యం

చిటార కొమ్మన ఉన్న మిఠాయి పొట్లం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘తేనె తుట్టె’. కానీ, ఈ చిరుతపులి దృష్టిలో మాత్రం చిటారు కొమ్మన ఉన్న మిఠాయి పొట్లం ఓ కోతి. దాన్ని అందుకోవటానికి చిటారు కొమ్మ వరకు చేరింది. మర్కటాన్ని కిందపడేయటానికి బాగానే శ్రమించింది. అది మాత్రం ప్రాణ భయంతో చిటారు కొమ్మను అతుక్కుపోయింది. కొద్దిసేపటి తర్వాత కోతి కింద పడిందనుకుందో ఏమో చిరుత పులి కిందకు దిగిపోయింది. కోతి బతుకు జీవుడా అనుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నంద శుక్రవారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. (గ‌ర్భిణీ ఏనుగును చంపింది ఇత‌డేనా?)

వీడియో దృశ్యం

‘‘చిటారు కొమ్మన ఉన్న కోతిని కిందపడేసి తినడానికి చిరుత ప్రయత్నం చేసింది. కోతి మాత్రం చెట్టును గట్టిగా పట్టుకుని బ్రతికి పోయింది. అరుదుగా కనిపించే దృశ్యం. నిన్న నేను పోస్ట్‌ చేసిన కోడెనాగు-కోతి వీడియో కంటే ఇది చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ప్రకృతి మనల్ని నిత్యం సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటుంది.. ప్రకృతి నిజంగా ఓ అద్భుతమైన థ్రిల్లర్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (వైరల్‌: మీ మనసును టచ్‌ చేసే వీడియో!)

చదవండి : కోబ్రాతో ఫైట్‌: కోతి పోరాటానికి ఫిదా! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement