టాయిలెట్‌లో అనుకోని అతిథి..భయంతో! | Large Snake Appeiared In Toilet Bowl At Benglore | Sakshi
Sakshi News home page

టాయ్‌లెట్లోకి చొరబడిన తాచుపాము!

Jun 20 2019 8:10 PM | Updated on Jun 20 2019 8:39 PM

Large Snake Appeiared In Toilet Bowl At Benglore - Sakshi

టాయ్‌లెట్‌లో ఐదడుగుల తాచుపాము

బెంగళూరు : టాయ్‌లెట్లోకి పాము చొరబడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బెంగుళూరులోని జేపీ నగర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ ఇంట్లోని టాయ్‌లెట్‌లో ఐదడుగుల తాచుపాము కనిపించింది. భయబ్రాంతులకు గురైన ప్రమోద్‌ వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో బృందంలోని ఓ వ్యక్తి ఆయన నివాసానికి చేరుకొని పామును బయటికి తీశారు. ఈ తతంగాన్నంతా ప్రమోద్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో వ్యక్తి దైర్యంగా టాయ్‌లెట్‌ నుంచి పామును బయటికి తీయడం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీనిని తీయడానికి మొదట  చేతిని  ఉపయోగించి, తరువాత ఒక వస్తువుతో తీసి సంచిలో వేసి తీసుకెళ్లాడు.

Advertisement
 
Advertisement
Advertisement