2017 : సంచలన తీర్పులు

Landmark Verdicts of 2017 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచిన ఏడాది ఇది. ట్రిపుల్‌ తలాక్‌, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు ఇలా పలు అంశాల్లో కోర్టులు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పులను వెలవరించాయి. 

ట్రిపుల్‌ తలాక్‌ 
ట్రిపుల్‌ తలాక్‌ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ.. సుప్రీంకోర్టు ఈ ఏడాది చారిత్రాత్మక తీర్పును వెలవరించింది. ట్రిపుల్‌ తలాక్‌ అనేది ముస్లిం మహిళల హక్కులను కాలరాసేలా ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రూపొందించింది. 

వ్యక్తిగత సమాచారం గోప్యత హక్కు
గోప్యత హక్కు అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా సుప్రీం సంచలన తీర్పును వెలవరించింది. తొమ్మిదిమంది న్యాయమూర్తుల బెంచ్‌.. దీనిని ఏకగ్రీవంగా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని ప్రకటించింది. 

2జీ కుంభకోణం
యూపీఏ హయాంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం స్కామ్‌పై పాటియాలా కోర్ట్‌ సంచలన తీర్పును ప్రకటించింది. 2జీ స్కామ్‌లో దోషులుగా ముద్రపడిన మాజీ టెలికాం మంత్రి ఏ రాజీ, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళిలు నిర్దోషులుగా పాటియాలా కోర్టు ప్రకటించింది. 

మైనర్‌ భార్యతో..!
మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది రేప్‌ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు అనూహ్యమైన తీర్పును ప్రకటించింది. బాల్య వివాహాలను నిరోధించడానికి ఈ తీర్పు దోహదం చేస్తుందని నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. 

డేరాబాబా
డేరా బాబాగా గుర్తింపు పొందిన గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌పై పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలవరించింది. తీర్పు తరువాత పంచకుల కోర్టు బయట డేరా అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఇద్దరు మహిళలపై అత్యాచారాలు చేశాడన్న అభియోగంపై డేరా బాబాను దోషిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. 

ఆరుషి హత్య కేసు
సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్‌ హత్యకేసులో తల్లిదండ్రులు నూపర్‌, రాజేష్‌ తల్వార్లను అలహాబాద్‌ హైకోర్టును నిర్దోషులుగా ప్రకటించింది. 2013 నుంచి దాస్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దంపతులు కోర్టు తీర్పుతో ఈ ఏడాది బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 

శశికళను వెంటాడిన ఆస్తుల కేసులు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళను ఆస్తుల కేసులు వెంటాడాయి.  2016లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాక ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో సీఎం ఆఫీస్‌కు వెళ్లాలని కలలుగన్న శశికళ.. బెంగళూరులోని పరప్పణ జైలుకు వెళ్లాల్సివచ్చింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top