లాలూపై తీర్పు నేటికి వాయిదా! | Lalu Prasad sentencing deferred again | Sakshi
Sakshi News home page

లాలూపై తీర్పు నేటికి వాయిదా!

Jan 5 2018 3:45 AM | Updated on Jan 5 2018 3:45 AM

Lalu Prasad sentencing deferred again - Sakshi

రాంచీ: దాణా కుంభకోణంలో బిహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌కు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. లాలూకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ఆయన సన్నిహితులు పలువురు తనకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ గురువారం వెల్లడించారు. తాను చట్టప్రకారమే తీర్పు ఇస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లాలూ, శివపాల్‌ల మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. తాను ఉంటున్న బిర్సాముండా జైలులో చలి అధికంగా ఉందని లాలూ జడ్జీకి ఫిర్యాదు చేయగా.. న్యాయమూర్తి స్పందిస్తూ ‘అయితే తబలా వాయించండి’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు. అనంతరం  లాలూ కోర్టులో సరిగ్గా ప్రవర్తించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. ‘నేను కూడా న్యాయవాదినే’ అని లాలూ ప్రతిస్పందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement