జర్నలిస్టులకు బీజేపీ లీడర్‌ వార్నింగ్‌ | Lal Singh Warns Kashmiri Journalists On Death Like Shujaat | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు బీజేపీ లీడర్‌ వార్నింగ్‌

Jun 23 2018 4:35 PM | Updated on Jun 23 2018 4:57 PM

Lal Singh Warns Kashmiri Journalists On Death Like Shujaat - Sakshi

లాల్‌ సింగ్‌ (పాత ఫొటో)

శ్రీనగర్‌, జమ్మూకశ్మీర్‌ : కథువా రేప్‌, హత్య కేసు గురించి గీత దాటి వార్తలు రాస్తున్నారని, అలా వార్తలు రాస్తున్న జర్నలిస్టులు వెటరన్‌ జర్నలిస్టు షుజాత్‌ బుఖారీ(కొద్దిరోజుల క్రితం షుజాత్‌ దారుణ హత్యకు గురయ్యారు)కి ఏం గతి పట్టిందో గుర్తుపెట్టుకోవాలని కశ్మీర్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు లాల్‌ సింగ్‌ హెచ్చరించారు.

శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన లాల్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. లాల్‌ సింగ్‌ నోటి దురుసుతో ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు. కథువా ఘటనలో నిందితుడి తరఫున జరిగిన ర్యాలీలో లాల్‌ సింగ్‌ పాల్గొన్నారు. కాగా, లాల్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాను కోరాలని కశ్మీర్‌ జర్నలిస్టులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement