‘ఇప్పుడు వారు ప్రభుత్వ పిల్లలు.. అది కూడా ముఖ్యమే’

Kerala Students Parents Thanks To Air India For Plane Dash To China - Sakshi

కేరళ: చైనాలోని వుహన్‌ నుంచి ప్రత్యేక ఎయిర్‌ ఇండియాలో భారత్‌కు చేరుకున్న కేరళ విద్యార్ధుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను డాక్టర్ల బృందంతో వుహాన్‌ వెళ్లి భారత్‌కు తీసుకువచ్చిన ఎయిర్‌ ఇండియాకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో.. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా హాస్సిటల్‌కు చెదిన ఐదుగురు డాక్టర్ల బృందం, ఎయిర్‌ పారమెడిక్‌ వారు చైనా వెళ్లి అక్కడి భారతీయ విద్యార్థులతో కలిసి ప్రత్యేక ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 747లో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేరళ వైద్య విద్యార్థిని తండ్రి  విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ..  అక్కడి మన తెలుగు వైద్య విద్యార్థులను వుహాన్‌ వెళ్లి తీసుకువచ్చిన ప్రభుత్వానికి, ఎయిర్‌ ఇండియాకు వేల కోట్ల ధన్యవాదాలు తెలిపారు. అతను, అతని భార్య బ్యాంక్‌ ఉద్యోగులగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ‘చైనాలో మా కూతురు మెడిసిన్‌ చదువుతుంది. చైనాలో కరోనా వైరస్‌ వ్యాపించి వందల మంది చనిపోతున్నారు అని తెలిసింది. అప్పటి నుంచి మా కూతురి మీద బెంగతో వారం రోజులుగా మేము నిద్ర లేని రాత్రులు గడిపాం. ఇప్పుడు మాకు కాస్తా ఊరటగా ఉంది. మా కూతురిని వుహాన్‌ నుంచి తీసుకువచ్చారని తెలియగానే మా ప్రాణాలు లేచోచ్చాయి. మా సంతోషాన్ని మాటల్లో చెప్పాలేం’ అంటూ అనందాన్ని వ్యక్తం చేశారు. 

కరోనా ఎఫెక్ట్స్‌: ఢిల్లీ చేరుకున్న 324 మంది భార‌తీయులు

ఇక చైనా నుంచి తీసుకువచ్చిన మొత్తం 324 మంది భారతీయులలో ఎక్కువ శాతం కేరళకు చెందిన వారె ఉండటం గమనర్హం. అదేవిధంగా మనేసర్‌లో రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచటంపై ఆయన మాట్లాడుతూ..‘ మాకు ఎటువంటి సమస్య లేదు. వారు భారతదేశానికి తిరిగి రావడం ముఖ్యం. వారు ప్రభుత్వ పిల్లలు, వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం కూడా ముఖ్యమే’అన్నారు. కాగా చైనా నుంచి వ‌చ్చిన భార‌తీయుల‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెట్టేందుకు ఢిల్లీ స‌మీపంలోని మ‌నేస‌ర్‌లో ప్ర‌త్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  మరోవైపు ఆర్మీ క్యాంపులో ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని రెండు వారాలపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు. పరీక్షల అనంతరం వారిని వారి స్వస్థలాలకు పంపించనున్నారు. కేరళలో 1,400 మందికిపైగా కరోనా వైరస్‌ వైద్య పరిశీలనలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులలో 50 మందిని ఐసోలేషన్ వార్డులలో చేర్పించగా, మరో 1,421 మంది కనీసం 28 రోజుల పాటు వారి నివాసాల్లో నిర్బంధించి ఉన్నారు.

చైనా నుంచి వచ్చే విద్యార్థుల కోసం.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top