భారత వైమానిక సంస్థ భారీ విరాళం | Sakshi
Sakshi News home page

భారత వైమానిక సంస్థ భారీ విరాళం

Published Sat, Aug 25 2018 4:00 PM

Kerala floods: Indian Air Force donates  Rs 20 crore - Sakshi

తిరువనంతపురం: కేరళ వరద  బాధితుల సహాయార‍్ధం  భారత వైమానిక సంస్థ భారీ విరాళాన్ని అందించింది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ వాసులను భారీగా సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సంస్థ తాజాగా ఆర్ధిక సహాయాన్ని కూడా చేయాలని నిర్ణయించింది. ఈ  మేరకు సీఎం వరద సహాయనిధికి 20కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. సీఎం డిస్ట్రస్‌ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్‌ఎఫ్‌)  చెక్‌ను శనివారం ఐఏఎఫ్‌ అందించింది.

కేరళ అంతటా వరద తుఫాను ప్రాంతాల్లో ఒక వారం పాటు కొనసాగిన  రెస్క్యూ కార్యక్రమాలలో పాల్గొన్న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది.  తిరువనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ను కలిసిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, సౌత్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ బి సురేష్‌ బృందం ఈ చెక్‌ను అందజేసింది.

Advertisement
Advertisement