రాసలీలల మంత్రి రాజీనామా | karnataka miniter hy meti submits resignation over sex scandal | Sakshi
Sakshi News home page

రాసలీలల మంత్రి రాజీనామా

Dec 14 2016 12:44 PM | Updated on Oct 30 2018 5:50 PM

రాసలీలల మంత్రి రాజీనామా - Sakshi

రాసలీలల మంత్రి రాజీనామా

అసెంబ్లీలోని తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించారన్న ఆరోపణలతో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై మేతి రాజీనామా చేశారు.

అసెంబ్లీలోని తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించారన్న ఆరోపణలతో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై మేతి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అందజేశారు. బాగల్‌కోట్‌కు చెందిన ఓ ఉద్యోగిని బదిలీ విషయం కొన్నిరోజుల ముందు మేతీ వద్దకు వచ్చింది. మేతీ ఆమెతో తన కార్యాలయంతో పాటు వివిధచోట్ల రాసలీలలు సాగించారని ఆరోపణలొచ్చాయి. 
 
ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియో బయటకు రావడం, అదంతా తీవ్ర గందరగోళానికి దారితీయడంతో మరింత నష్టం జరగకుండా నివారించేందుకు మేతీతో సిద్దరామయ్య రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి హెచ్.వై. మేతి రాజీనామాను సీఎం సిద్దరామయ్య తక్షణం ఆమోదించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement