పలు రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్‌ | Karnata and other States announce mini lockdowns | Sakshi
Sakshi News home page

పలు రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్‌

Jul 12 2020 3:52 AM | Updated on Jul 12 2020 3:52 AM

Karnata and other States announce mini lockdowns - Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు పలు రాష్ట్రాలు మినీలాక్‌డౌన్‌ విధించాయి. కర్ణాటక, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లో లాక్‌డౌన్‌ విధించారు. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌ ప్రాంతాల్లో జూలై 14 రాత్రి 8 గంటల నుంచి జూలై 22 ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కర్ణాటక సీఎం  తెలిపారు. అస్సాం రాష్ట్రం గౌహతిలోని కామ్‌రూప్‌లో జూలై 12 నుంచి మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్, నహర్‌లాగన్, నిర్జులి, బందర్‌దేవాల్లో గతంలో విధించిన లాక్‌డౌన్‌ జూలై 13 సాయంత్రానికి ముగియనుండడంతో దీన్ని మరోవారం పొడిగించారు.

Advertisement
 
Advertisement
Advertisement