‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’

Kapil Mishra Says People Of Delhi Will Vacate Both Shaheen Bagh And CM Residence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక పాలక ఆప్‌ ప్రమేయం ఉందని బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఆరోపించారు. ఆప్‌ సర్కార్‌ గత ఐదేళ్లలో ఆస్పత్రులు, ఫ్లైఓవర్లు, కాలేజీలు, రోడ్లు నిర్మిస్తే షహీన్‌బాగ్‌ను నిర్మించే అవసరం లేకపోయేదని వ్యాఖ్యానించారు. ఆప్‌ షహీన్‌బాగ్‌ను ప్రేరేపిస్తే ఢిల్లీ ప్రజలు షహీన్‌బాగ్‌తో పాటు సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారని మిశ్రా ట్వీట్‌ చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ఫిబ్రవరి 8న ఇండియా, పాకిస్తాన్‌ల పోరును తలపిస్తుందని కపిల్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. మిశ్రాను 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆప్‌, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

చదవండి : కపిల్‌ మిశ్రాపై 48 గంటల నిషేధం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top