రోశయ్యకు అదనపు బాధ్యతలు | K. Rosaiah to hold additional charge as Karnataka Governor | Sakshi
Sakshi News home page

రోశయ్యకు అదనపు బాధ్యతలు

Jun 28 2014 2:08 AM | Updated on Jul 29 2019 6:58 PM

రోశయ్యకు అదనపు బాధ్యతలు - Sakshi

రోశయ్యకు అదనపు బాధ్యతలు

తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యకు కర్ణాటక గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.

- కర్ణాటక ఇన్‌చార్జ్ గవర్నర్‌గా నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ర్టపతి ప్రణబ్
 చెన్నై, సాక్షి ప్రతినిధి :
తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యకు కర్ణాటక గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. 2009లో కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన హెచ్‌ఆర్ భరధ్వాజ్ పదవీ కాలం శనివారంతో ముగియనుంది.

ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్‌ను నియమించే వరకు కర్ణాటక గవర్నర్‌గా అదనపు బాధ్యతలను రోశయ్యకు అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా పుదుచ్చేరి గవర్నర్ లెఫ్టినెంట్ వీరేంద్రకటారియా శుక్రవారం చెన్నై రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ రోశయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement