హీరోయిన్‌ రష్మిక హాజరు కావాల్సిందే.. | it notices issued for actress rashmika mandanna family | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ రష్మిక ఫ్యామిలీకి ఐటీ నోటీసులు

Jan 19 2020 4:53 AM | Updated on Jan 19 2020 3:23 PM

it notices issued for actress rashmika mandanna family - Sakshi

సాక్షి, బెంగళూరు: బహు భాషా హీరోయిన్‌ రష్మికా మందన్న నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 21న (మంగళవారం) బెంగళూరులోని ఐటీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్‌, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రష్మిక నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి,పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మదన్‌ తెలిపారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరు అవుతామని ఆయన పేర్కొన్నారు.

చదవండి:

రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం

ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్

రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు

సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement