నగ్నంగా.. రక్తపు మడుగులో.. | Irish woman allegedly raped and murdered in goa beach | Sakshi
Sakshi News home page

నగ్నంగా.. రక్తపు మడుగులో..

Mar 15 2017 11:31 AM | Updated on Jul 28 2018 8:53 PM

నగ్నంగా.. రక్తపు మడుగులో.. - Sakshi

నగ్నంగా.. రక్తపు మడుగులో..

గోవాలో ఓ విదేశీ మహిళ దారుణ హత్యకు గురైంది.

గోవా: గోవాలో ఓ విదేశీ మహిళ దారుణ హత్యకు గురైంది. ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇటీవల గోవాకు వచ్చింది. వాళ్లిద్దరూ సోమవారం స్థానికంగా జరిగిన హోలీ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అనంతరం ఆమె కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె మృతదేహం నగ్నంగా బీచ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
 
ఘటపై సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్‌ కాలేజి ఆసుపత్రికి తరలించారు. హత్యకు ముందు అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. హోలీ వేడుకల్లో ఆమె ఎవరితో సన్నిహితంగా ఉందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి స్నేహితుడిని కూడా విచారించారు. అతడు తెలిపిన వివరాల మేరకు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌ సమ్మీ టావర్సె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement