లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు వినూత్న శిక్ష | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు వినూత్న శిక్ష

Published Sun, Mar 29 2020 7:08 AM

Innovative Punishment For Lockdown Offenders In Jaipur - Sakshi

జైపూర్‌: లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రాజస్తాన్‌ అధికారులు వినూత్న శిక్ష విధిస్తున్నారు రాజస్తాన్‌లోని జున్‌జున్‌ ప్రాంత అధికారులు. ‘ఏ పనీలేకుండా రోడ్లపైకి వచ్చే వారిని అరెస్టు చేయడం, లాఠీలతో కొట్టడం చేయరాదని నిర్ణయించుకున్నాం. అందుకు బదులుగా వారిని జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులకు సేవలందించేందుకు పంపిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. (ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్‌!)

‘ఇదేమీ తమాషా కాదు. ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో సిబ్బంది కొరత బాగా ఉంది. అందుకే ఉల్లంఘనుల ద్వారా రోగులకు సేవలందించనున్నాం. రోడ్లపై చిల్లరగా తిరిగే వారిని గుర్తించి మాకు ఫొటోలు పంపితే, అధికారులు వారిని గుర్తించి క్వారంటైన్‌లలో సేవలకు వినియోగించుకుంటారు’ అని సామాజిక మాధ్యమాల్లో అధికారులు ప్రజలకు సందేశాలు పెడుతున్నారు.(భయం వద్దు.. మనోబలమే మందు)

Advertisement
Advertisement