మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి | injured boy Ramandeep Singh is died at hospital | Sakshi
Sakshi News home page

మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి

May 1 2016 10:25 PM | Updated on Jul 12 2019 3:02 PM

మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి - Sakshi

మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి

సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.

సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అలాంటి సంఘటనే ఆదివారం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట సెల్ఫీ తీసుకుంటూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు నేటి సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్‌ సింగ్‌ కాంట్రాక్టరు. ఆయన వద్ద ఓ లైసెన్స్‌డ్ రివాల్వర్‌ ఉంది. ఈ క్రమంలో శుక్రవారం బంధువు ఇంట్లో శుభకార్యానికి భార్యతో సహా వెళ్లాడు. జరిగే దారుణాన్ని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు.

ఇంట్లో ఉన్న వారి 15 కుమారుడు ఏళ్ల రమన్‌దీప్‌ సింగ్‌ తన తండ్రి రివాల్వర్‌ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.. రివాల్వర్‌ను కణతకు ఆనించుకుని సెల్ఫీకి ఫోజిస్తూ.. ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై నొక్కడంతో రివాల్వర్‌ పేలింది. పేలుడు శబ్ధం విన్న చుట్టుపక్కల వాళ్లు తీవ్రంగా గాయపడ్డ రమన్ దీప్ ను ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రులు కూడా ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డారు. రెండు రోజులపాటు లూథియానాలోని దయానంద్‌ మెడికల్‌ కాలేజీలో ప్రాణాలతో పోరాడిన రమన్ దీప్ నేటి సాయంత్రం మృతిచెందాడు. రమన్ దీప్ ఇకలేడన్న వార్త విన్న బంధువులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement