ఇంద్రాణీ ముఖర్జియాకు అస్వస్థత | INDRANI HOSPITALISED AFTER ‘DRUG OVERDOSE’ | Sakshi
Sakshi News home page

ఇంద్రాణీ ముఖర్జియాకు అస్వస్థత

Apr 8 2018 4:14 AM | Updated on Apr 8 2018 4:14 AM

INDRANI HOSPITALISED AFTER ‘DRUG OVERDOSE’ - Sakshi

ఇంద్రాణీ ముఖర్జియా

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా(46) అస్వస్థతకు లోనయ్యారు. దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలులో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను అధికారులు శుక్రవారం రాత్రి ఇక్కడి జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంద్రాణీకి సీసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డీన్‌ ఎస్డీ ననంద్‌కర్‌ తెలిపారు. ఇంద్రాణీ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. 2012, ఏప్రిల్‌లో కుమార్తె షీనా బోరాను అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో ఇంద్రాణీని పోలీసులు 2015లో అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement