భారత సంపన్నుడి కూతురి విలాసం

A Indian Father Hires 12 Servants For Daughter In Scotland College - Sakshi

‘కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని ఒకే ఒక ప్రాణి నాన్న’. తన దగ్గర ఉన్నప్పుడు కూతురిని యువరాణిలా చూసుకునే తండ్రి.. దేనికైనా బయటకి పంపించాల్సి వస్తే అన్ని జాగ్రత్తలతోనే పంపుతాడు. ప్రతి తండ్రి తన కూతురు బంగారం అంటారు.. మరి బంగారాన్ని జాగ్రత్రగా కాపాడుకోవాలనేదే తండ్రి తాపత్రయం. అలాంటి తాపత్రయమే పడ్డాడు ఓ భారత కుబేర తండ్రి. చదువు నిమిత్తం తన కూతురిని పరాయి దేశానికి పంపిచాల్సి వచ్చింది. అయితే అక్కడ తన గారాల పట్టికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉండటానికి ఏకంగా 12 మంది సిబ్బందిని నియమించాడు. ఈ 12 మంది వారివారి రంగాల్లో నిష్ణాతులు. కుక్‌, వెయిటర్‌, ఫిజీషియన్‌, డ్రైవర్‌, హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ ఇలా 12 మందిని కూతురికి సహాయంగా ఉండటానికి భారీ వేతనాలతో పరాయి దేశం పంపించాడు .

అసలు ముచ్చటేంటంటే..
భారత్‌లో అత్యంత సంపన్నుడి(పేరు వెల్లడించలేదు) కూతురుకి స్కాట్లాండ్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌లో సీటు లభించింది. అక్కడి ఓ హాస్టల్‌లో ఆమె చేరింది. వారం రోజుల అనంతరం ఆ యువతి.. ఇక్కడ అన్ని పనులు తానే చేసుకోవడం ఇబ్బందిగా ఉందని తండ్రితో చెప్పింది. దీంతో ఒక విలాసవంతమైన భవానాన్ని కూతురు కోసం అద్దెకు తీసుకొని, దేశంలో వివిధ రంగాల్లో అనుభవం కలిగిన వారిని భారీ వేతనంతో(సంవత్సరానికి రూ. 28.5 లక్షలు) పంపించాడు. తన కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఉద్యోగులకు గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఇలా నాలుగు సంవత్సరాల యూనివర్సిటీ ఫీజు కన్నా సిబ్బంది వేతనమే ఎక్కువగా ఉంది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top