విగ్రహాల దొంగల ముఠా అరెస్ట్ | Idol theft gang busted, 6 held | Sakshi
Sakshi News home page

విగ్రహాల దొంగల ముఠా అరెస్ట్

Nov 4 2014 6:13 AM | Updated on Aug 20 2018 4:27 PM

దేవాలయాలల్లో విగ్రహాలను దొంగలిస్తున్న ముఠాను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుచిరాపల్లి: దేవాలయాలల్లో విగ్రహాలను దొంగలిస్తున్న ముఠాను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 కాంస్య విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక వింగ్ ఐజీ పొన్ మాణిక్వేల్ సూచనల మేరకు పోలీసులు వర్తకులు, నిందితులపై నిఘా వేసి ఈ ముఠాను పట్టుకున్నారు. గత మేలో వీటిని దొంగలించినట్టు పోలీసులు తెలిపారు. ఓ మహిళా డాక్టర్ హత్య కేసును ప్రత్యేక బృందం విచారిస్తున్న సమయంలో విగ్రహాల దొంగల ముఠా ఆచూకీ లభ్యమైంది.

Advertisement
 
Advertisement
Advertisement