లాలూ కుటుంబానికి మరో షాక్‌ | I-T department attaches assets of Misa Bharti, husband in alleged benami assets probe | Sakshi
Sakshi News home page

లాలూ కుటుంబానికి మరో షాక్‌

Sep 11 2017 5:40 PM | Updated on Sep 19 2017 4:22 PM

లాలూ కుటుంబానికి మరో షాక్‌

లాలూ కుటుంబానికి మరో షాక్‌

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ మరో షాకిచ్చింది.

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ మరో షాకిచ్చింది. ఢిల్లీ, పాట్నలోని కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక లాలూ కూతురు మిసాభారతి, భర్త శైలేష్‌ కుమార్‌ ఆస్తులకు తుది అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ను జారీచేసింది. బినామి ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఐటీ ఈ చర్యలు తీసుకుంటోంది.
 
త్వరలోనే లాలూ ప్రసాద్‌పై ఐటీ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 5నే సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీలోని బిజ్వాసాన్‌ ప్రాంతంలో మిసాభారతి ఫామ్‌హౌజ్‌ను ఈడీ అటాచ్‌ చేసింది. బినామి ఆస్తుల విచారణలో భాగంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా ఐటీ ఆగస్టులో విచారించింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement