ఆధారాలుంటే.. కమల్‌పై కేసు పెట్టండి: హైకోర్టు

High Court directive to police on case against Kamal Haasan - Sakshi

సాక్షి, చెన్నై: తగిన ఆధారాలుంటే నటుడు కమలహాసన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా మద్రాస్‌ హైకోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. నటుడు కమలహాసన్‌ రాజకీయ పార్టీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తన గళం ఎత్తుతున్నారు. రాజకీయ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకున్న అనంతరం కమల్‌ కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఇటీవల హిందు తీవ్రవాదం లేదని చెప్పలేమంటూ ఓ వార్తాపత్రికలో ఆయన పేర్కొన్న తీవ్ర వివాదానికి దారి తీశాయి. పలు హిందూత్వ సంఘాలు కమల్‌పై విమర్శలతో విరుచుకుపడ్డాయి. ఇదే అంశంపై చెన్నైకి చెందిన దేవరాజ్‌ అనే వ్యక్తి చెన్నై హైకోర్టులో కమలహాసన్‌పై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ శుక్రవారం జరిగింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి తగిన ఆధారాలు ఉంటే నటుడు కమలహాసన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top