ముంబైలో భారీ వర్షాలు.. సెలవులు రద్దు

Heavy Rains In Mumbai 2018 - Sakshi

ముంబై : మొన్నటి వరకు ఎండల వేడితో మండిపోయిన ముంబై ఇప్పడు భారీ వర్షాలతో విలవిల్లాడిపోతోంది. శనివారం ముంబై నగరాన్ని భీకరమైన వర్షాలు ముంచెత్తాయి. దాంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పండి. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ యుద్ధప్రతిపదికన సహయక చర్యలు చేపట్టింది. బీఎంసీ ఉన్నతాధికారుల సెలవులను వారం రోజుల పాటు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

భార్షీ వర్షాల కారణంగా ముంబై నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీస్‌లను రద్దు చేస్తున్నట్టు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయ అధికారులు తెలిపారు. వారం రోజలు పాటు భారీ వర్ష సూచన ఉన్న కారణంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top