గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు | heavy rains may be heppen more days | Sakshi
Sakshi News home page

గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

Dec 4 2015 7:38 AM | Updated on Sep 3 2017 1:29 PM

నైరుతి బంగాళాఖాతంలో లంకకు సమీపంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 4.5కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది.

చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో లంకకు సమీపంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 4.5కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర కోస్తాలోని ఒకట్రెండు చోట్ల వర్షాలు ఉంటాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement