అతి తీవ్ర తుపానుగా బలపడిన ‘అర్నబ్‌’ | Cyclone Arnab Updates: High Alert For Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అతి తీవ్ర తుపానుగా బలపడిన ‘అర్నబ్‌’

Oct 27 2026 6:58 AM | Updated on Oct 27 2026 7:11 AM

Cyclone Arnab Updates: High Alert For Andhra Pradesh

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ అతి తీవ్ర తుపానుగా బలపడింది. వేగంగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో కదిలిన తుపాను.. ప్రస్తుతానికి విశాఖ 300 కి.మీ, కాకినాడకు 360కిమీ, మచిలీపట్నంకు 460, బాపట్లకు 530 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Cyclone Arnab Updates:

తుపాను ఎఫెక్ట్.. నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు

  • కాకినాడ జిల్లా: ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకల బంద్

  • తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

  • జిల్లా వ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

  • సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించిన అధికారులు

  • తీరానికి చేరుకున్న బోట్లు

  • హోప్ ఐలాండ్ నుండి 130 మంది మత్స్యకారులను తూరంగి వద్ద ఐలాండ్ కాలనీకి తరలింపు

  • తుపాను సహయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రాక

  • తుఫాన్ సహయక చర్యలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

  • ల్యాండ్ లైన్: 0884-2356801

  • మొబైల్ : 9849903879

  • కాకినాడ ఆర్ డి ఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ 8008803208

  • పెద్దాపురం  ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూం నెంబర్ 7993668485

ప్రారంభమైన తుపాను ప్రభావం

  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు

  • శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు

  • కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన ఈదురుగాలులు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

  • మరికాసేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు

  • శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు

  • కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన ఈదురుగాలులు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

నేడు, రేపు భారీ వర్షాలు 

  • సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి.. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనం

  • రేపు ఉదయానికి బాపట్ల -విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం

  • దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

  • అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు

  • కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతోఈదురుగాలులు

ఈ జిల్లాలకూ రెడ్‌అలెర్ట్‌

  • బుధవారం తీరాన్ని దాటే సమయంలో తీవ్రంగా తుపాను ప్రభావం
  • ఆ రోజు విశాఖ, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం రెడ్‌ అలెర్ట్‌
  • రేపు(బుధవారం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు, యానాంలో అతి భారీ వర్షాలు
  • శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
  • తీరం దాటిన మరుసటి రోజు గురువారం కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
  • ఈ నాలుగు రోజులు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement