breaking news
south coastal
-
దక్షిణమధ్య రైల్వేలో భారీ కుదుపు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు భారతీయ రైల్వేల్లోనే ఐదోస్థానం ఉంది. ప్రయాణికుల రాకపోకల్లోనూ, సరుకు రవాణాలోనూ రికార్డుస్థాయిలో ఆదాయం వస్తుంది. అలాంటి దక్షిణమధ్య రైల్వే ఘనత ఇక మసకబారనుంది. మొట్టమొదట హైదరాబాద్ కేంద్రంగా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సేవలు ఆరంభమయ్యాయి. భారతీయ రైల్వేలో విలీనమైన తరువాత 1966 అక్టోబర్ 2వ తేదీన దక్షిణమధ్య రైల్వే జోన్ (south central railway) ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంతభాగంతో కలిపి మొత్తం 6 డివిజన్లతో సేవలందజేస్తున్న దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధి ప్రస్తుత విభజనతో గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం సుమారు 650 రైళ్లు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తున్నాయి. 12 లక్షల మందికి పైగా ప్రయాణికులు దక్షిణమధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు.విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణమధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది. ప్రయాణికులు, రైళ్ల రాకపోకలతో పాటు, ఆదాయం కూడా భారీగా తగ్గుముఖం పట్టనుందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం నగరంలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో సగానికి పైగా కొత్త జోన్‌కు తరలి వెళ్లనున్నారు. డివిజన్ల సంఖ్య కూడా 6 నుంచి 3 కు తగ్గనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంటాయి. వీటితో పాటు లాలాగూడ వర్క్‌షాపు ఉంటుంది. అలాగే లాలాపేట్‌లోని రైల్వే కేంద్ర ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు, అధికారులు, సిబ్బంది విభజన కూడా అనివార్యం కానుంది. తగ్గనున్న పరిధి..ప్రస్తుతం సుమారు 6400 కి.మీ.పరిధిలో దక్షిణమధ్య రైల్వే రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే 12 లక్షల మంది ప్రయాణికుల ద్వారా ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుంది. జోన్ విభజన వల్ల ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు తగ్గనుంది. జోన్ పరిధి కూడా 2500 కి.మీ. వరకు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని జిల్లాల కంటే హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. ఆదాయార్జనలో హైదరాబాద్ మాత్రమే కీలకం కానుంది.‘ప్రయాణికులు ఏ జోన్ ఒరిజినేటింగ్ (ప్రారంభ) స్టేషన్ నుంచి బయలుదేరితే టిక్కెట్లపైన వచ్చే ఆదాయం ఆ జోన్‌కే చెందుతుంది. ఈ లెక్కన విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి లభించే ఆదాయం దక్షిణ కోస్తా జోన్‌కు వెళ్లనుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే ప్రయాణికుల ఆదాయం దక్షిణమధ్య రైల్వేకు లభిస్తుంది. దీంతో ఈ జోన్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఇప్పటికే దక్షిణకోస్తా జనరల్ మేనేజర్ నియామకం పూర్తయిన దృష్ట్యా మరో ఐదారు నెలల్లో జోన్‌లోని అన్ని విభాగాల విభజన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి అభిప్రాయపడ్డారు.ఉద్యోగుల విభజన... దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని విభాగాల్లో 1.05 లక్షల మంది పనిచేయవలసి ఉండగా ప్రస్తుతం 92 వేల మంది పని చేస్తున్నారు. 14 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డివిజన్లలో విధులు నిర్వహించే డివిజనల్ రైల్వేమేనేజర్లు మొదలుకొని ఆయా డివిజన్లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది యదావిధిగా అక్కడే ఉంటారు. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి కార్యాలయాలుగా ఉన్న రైల్‌నిలయం, లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్, రైల్వే కేంద్రీయ ఆసుపత్రిల్లో పని చేసే అధికారులు, సిబ్బంది మాత్రం రెండు జోన్లకు చెందనున్నారు. చదవండి: నాలుగో నగరి భవిష్యత్తు.. మూడో నగరిలో..ఈ కార్యాలయాల్లో 3500 మందికి పైగా పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో 2000 మందికి పైగా దక్షిణ కోస్తాకు బదిలీ కానున్నారు. విభజన ఏర్పాట్లు ప్రాథమిక దశలో ఉన్నాయని, అన్ని అంశాల్లోనూ త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒక అధికారి వివరించారు. పూర్తిస్థాయి విభజన జరిగిన తరువాత కొత్త జోన్ అవతరణ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. -
దక్షిణ కోస్తా వైపు వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అది అదే దిశలో 3 రోజులు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 20 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. -
విశాఖ జోన్ పరిధిపై స్పష్టత!
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను విలీనం చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌పై ఒకింత స్పష్టత వచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. వాల్తేరు డివిజన్లో కొంతభాగాన్ని విజయవాడ, మరికొంత భాగాన్ని కొత్తగా ఏర్పడబోయే రాయగడ డివిజన్లో కలుపుతున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపై స్పష్టతనిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ డివిజన్‌లోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పూర్తిగా చేర్చింది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాయగడ డివిజన్లో కలుపుతారని భావించారు. విశాఖ రైల్వే జోన్ పరిధి ఏపీ సహా తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో కొంతమేర విస్తరించి ఉంటుంది. ఈ జోన్ పరిధిలోకి మూడు ఏ–1 కేటగిరి స్టేషన్లు, ఎ కేటగిరి స్టేషన్లు 21, బి కేటగిరి స్టేషన్లు 20 వచ్చాయి. అయితే దీనిపై ఇంకా తమకు అధికారిక ఉత్తర్వులు అందలేదని విశాఖ రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. కాగా, జోన్ పరిధిలోని తిరుపతి, రాయనపాడులో మెకానికల్ వర్క్‌షాపులు, విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, నర్సాపూర్, గుంతకల్, మచిలీపట్నంలో కోచ్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. అలాగే విశాఖ, గుత్తి, గుంతకల్లు, విజయవాడలో డీజిల్ లోకోషెడ్లు.. విజయవాడ, గుంతకల్లు, విశాఖలో ఎలక్ట్రిక్ లోకోషెడ్లు, రేణిగుంటలో ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్, రాజమండ్రిలో మెము కార్‌షెడ్డు ఉన్నాయి. విశాఖ, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నల్లపాడు, తిరుపతి, గుంతకల్లులో పాసింజర్ కోచ్ కేర్ డిపోలు, విజయవాడ, గుత్తిలో వ్యాగన్ మెయింటెనెన్స్ డిపోలున్నాయి. విజయవాడ, గుంతకల్లు, గుత్తిలో రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, విశాఖ, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడులో డివిజనల్ ఆస్పత్రులు.. గుంటూరులో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం హెల్త్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. -
గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో లంకకు సమీపంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 4.5కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలోని ఒకట్రెండు చోట్ల వర్షాలు ఉంటాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది. -
దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. విదర్భ, దక్షిణ కోస్తా, తెలంగాణ మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది. దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని... అలాగే ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. -
దక్షిణ కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్, దాన్ని ఆనుకుని మధ్య ఒరిస్సా, విదర్భ ప్రాంతంలో భూ ఉపరితలంపై అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. అల్పపీడనం భూమిపైకి రావడంతో వాయుగుండంగా మారే అవకాశాల్లేవని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. మరోవైపు ఒరిస్సా నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుం చి అతి భారీ వర్షాలు, కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. పాలకొండ, కొమరాడల్లో 9 సెం.మీ. ఆదివారం ఉదయానికి గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలోని పాలకొండ, కొమరాడల్లో గరిష్టంగా 9 సెం.మీ., పార్వతీపురం, జియ్యమ్మవలస, మందసలో 7 సెం.మీ. వర్షపాతం నమోదయింది. తెలంగాణలోని సిర్పూర్లో గరిష్టంగా 23 సెం.మీ. వర్షం కురిసింది. మంథని 19, మంచిర్యాల 16, రామగుండం 15, చెన్నూరు, కాళేశ్వరం, అసిఫాబాద్‌లో 13, పేరూరు 12, వెంకటాపురం, భూపాలపల్లిల్లో 11, గోల్కొండ, గోవిందరావుపేటలో 10, లక్సెట్టిపేట 9, పరకాల, ఉట్నూరుల్లో 8, అదిలాబాద్, ధర్మపురి, సారంగపూర్, తాండూరు, ములుగుల్లో 7, ఏటూరునాగారం, మొగుళ్లపల్లిల్లో 6, జూలపల్లి, నల్లబెల్లి, జగిత్యాలల్లో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది. -
దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ
-
దక్షిణ కోస్తాపై ‘హెలెన్’ పడగ
రేపు ఉదయం ఒంగోలు వద్ద తుపాను తీరం దాటే అవకాశం నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ముప్పు అప్రమత్తమైన ప్రభుత్వం.. రంగంలోకి సహాయక దళాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/ఢిల్లీ: పై-లీన్ తుపాను, భారీవర్షాల దెబ్బ నుంచి కోలుకుంటున్న రాష్ట్రంపైకి మరో పెనుతుపాను ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారానికి తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలి పింది. దీన్ని ‘హెలెన్’ తుపానుగా పిలుస్తున్నారు. పశ్చిమంగా పయనిస్తూ మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, కావలికి తూర్పున 420 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య ఒంగోలు వద్ద శుక్రవారం ఉదయానికి తీరం దాటే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచే కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. హెలెన్ పెను తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్త ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్లు నేలకొరగడం, విద్యుత్ వైర్లు తెగిపడటం, ఇళ్ల పైకప్పులు లేచిపోవడం వంటి సంఘటనలు జరగవచ్చని తెలిపింది. దాదాపు 2 మీటర్ల మేర అలలు ఎగిసి పడనున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో హెలెన్ తుపాను ప్రభావం వల్ల ఈదురుగాలులు, చెదురుమదురు వర్షాలు మినహా పెద్ద ప్రమాదం ఉండబోదని చెబుతున్నారు. తీరం దాటాక 48 గంటలపాటు దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం రాత్రి నుంచే గాలులు గంటకు 55-65 కి.మీ. వేగంతో వీచే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణపట్నంలో 5వ, వాడ్రేవులో 7వ, నిజాంపట్నం, మచిలీపట్నంలో 6వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొదని, సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. అధికార యంత్రాంగం అప్రమత్తం: ‘హెలెన్’ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి 4 జిల్లాల కలెక్టర్లను ఆదేశిం చారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. చిత్తూరు పర్యటనలో ఉ న్న సీఎం కిరణ్ కూడా హెలెన్ తుపాన్‌పై ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. జాతీయ బృందాలతోపా టు, కోస్తా ప్రాంత రక్షణ విభాగం, మెరైన్ పోలీసు సిబ్బంది ప్రజలకు సాయం అందించడానికి రంగంలోకి దిం చినట్లు తెలిపారు. సచివాలయంలో 23456005, 23451043 నం బర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. 25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం: పార్థసారథి హెలెన్ తుపాను ప్రభావం వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వరకూ భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ సి పార్థసారథి వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రెండేసి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఒక్కొక్క జాతీయ విపత్తు నివారణ దళ బృందాలను పంపినట్లు తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి సమీక్ష: తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం సమీక్షించారు. తదనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 జాతీయ విపత్తు నివారణ దళం బృందాలను ముందుగానే పంపామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 33 మండలాలపై తీవ్ర ప్రభావం నెల్లూరు జిల్లాలో 12 మండలాల పరిధిలోని తీరంలోని గ్రామా ల నుంచి 25 వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. మంగళగిరి నుంచి 90 మందితో కూడిన నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందాలు రెండు కావలి, నెల్లూరు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లాలో తీరం వెంబడి ఉన్న 11 మండలాల్లోని 28 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 6 మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం వేటకు వెళ్లిన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన నలుగురు జాలర్లు బుధవారం సురక్షితంగా ఇంటికి చేరారు. లైలా అంతటి తీవ్రత.. న్యూఢిల్లీ: హెలెన్ తుపాను తీవ్రత ఫై-లిన్ తుపాను అంత ఉండదని, అయితే 2010లో ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన లైలా తుపాను అంతటి విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఎం మహాపాత్ర బుధవారం న్యూఢిల్లీలో విలేకరులతో చెప్పారు. మచిలీపట్నం- నెల్లూరు మధ్య ఒంగోలు సమీపంలో 22వ తేదీ ఉదయం హెలెన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. -
బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్టణం: నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం దక్షిణకోస్తాపై ఎక్కువగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తాలో చాలా చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశముందని తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇప్పటికే రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఒకవైపు వర్షాలు, మరోవైపు అధికమవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే, మరికొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది. దక్షిణ కోస్తా అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉందని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదగా అల్ప పీడన ద్రోణి చురుగ్గా కదులుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.