రాగల 24 గంటల్లో.. అతి భారీ వర్షాలు! | Heavy rains forecast in Telangana | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Aug 15 2018 5:28 PM | Updated on Aug 15 2018 6:47 PM

Heavy rains forecast in Telangana - Sakshi

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా తీరంపై భువేనేశ్వర్‌కు ఆగ్నేయంగా 30 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement