తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను గవర్నర్ ఈ సందర్భంగా ప్రధానికి వివరించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్ర సంస్థల విభజన, కేంద్ర సాయం అనంతరం ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.