సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు

goa police files fir over teachers morphed photos on social media - Sakshi

పనాజీ: ఆన్​లైన్ తరగతులు చెబుతున్న టీచర్ల ఫొటోలు తీసి, మార్ఫింగ్ చేసి అవమానకర రాతలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటన గోవా రాజధాని పనాజీలోని పాంజిమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్టూడెంట్స్ చర్యతో షాక్ కు గురైన సదరు స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (నాన్నా.. తాగొద్దు.. అమ్మను బాగా చూసుకో)

‘కొందరు స్టూడెంట్స్ ఆన్​లైన్​ తరగతులు జరుగుతున్న సమయంలో టీచర్ల ఫొటోలు స్క్రీన్ షాట్ తీశారు. వాటిని మార్ఫింగ్ చేసి, తిడుతూ సోషల్ మీడియాలో పెట్టారు. ఈ మేరకు సదరు స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం’ అని పాంజిమ్ ఎస్పీ పంకజ్ కుమార్ వెల్లడించారు. (నేను చనిపోతున్నా.. కాబోయే భార్యకు మెసేజ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top