మోదీకి కలిసొచ్చిన గోవా | Goa is favourite to narendra modi | Sakshi
Sakshi News home page

మోదీకి కలిసొచ్చిన గోవా

Nov 10 2014 7:27 AM | Updated on Aug 24 2018 2:17 PM

ప్రధాని మోదీకి గోవా రాజకీయంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మోదీ గుజరాత్ సీఎంగా...

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి గోవా రాజకీయంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినప్పటికీ ఆయన్ను సీఎం పదవిలో కొనసాగిస్తూ గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూన్‌లో గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో మోదీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించారు.

దీంతో ఆయన ప్రధాని కాగలిగారు. ఈ నేపథ్యంలోనే చిన్న రాష్ర్టమైన గోవా రెండు కేంద్ర మంత్రి పదవులను పొందగలిగింది. కేబినెట్‌లో ఇప్పటికే గోవాకు చెందిన శ్రీపాద్ నాయక్ ఉండగా తాజాగా మాజీ సీఎం పారికర్ చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement