జమ్మూకశ్మీర్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. | Gita Mittal Appointed As Jammu And Kashmir Chief Justice | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి..

Aug 4 2018 12:11 PM | Updated on Aug 31 2018 8:42 PM

Gita Mittal Appointed As Jammu And Kashmir Chief Justice - Sakshi

జస్టిస్‌ గీతా మిట్టల్‌ (ఫైల్‌)

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి  ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమార్తిగా ఉన్న జస్టిస్‌ గీతా మిట్టల్‌ను జమ్మూకశ్మీర్‌ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వురు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో ఇద్దరు జడ్జీలు జమ్మూకశ్మీర్‌ హైకోర్టులో బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఢిల్లీ యూనివర్శిటీలో న్యాయవిద్యను పూర్తి చేసుకున్న గీత మిట్టల్‌ 1981 నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఆమె 2004 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు అడిషనల్‌ జడ్జీగా నియమితులయ్యారు. గత సంవత్సరం ఢీల్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి పదవీ విరమణ చేసిన తర్వాత గీత మిట్టల్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఢీల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు పనితీరులో మార్పులు తీసుకువచ్చారు.  ఆమె చేసిన న్యాయ సేవలకుగానూ ‘ నారీ శక్తి పురష్కార్‌’’ ను అందుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement